BREAKING : తెలంగాణ ఎంసెట్, ఈ-సెట్ నోటిఫికేషన్ విడుదల..తేదీలు ఇవే

-

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయింది. కాసేపటి క్రితమే.. తెలంగాణ విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… ఏప్రిల్ మాసం 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. అలాగే…. ఎంసెట్ పరీక్షల దరఖాస్తు.. జనరల్‌ అభ్యర్థులకు ఫీజు రూ.800 గా పేర్కొంది విద్యాశాఖ.

అలాగే… ఎస్సీ, ఎస్టీలకు రూ.400 లను ఫిక్స్‌ చేసింది. అలాగే.. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ జరుగనున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ జరుగనున్నట్లు ప్రకటన చేసింది.

అటు ఈ సెట్ పరీక్షల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. జులై 13 న ఎంట్రెన్స్ జరుగన్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏప్రిల్ మాసం 6 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశాఖ.

Read more RELATED
Recommended to you

Latest news