మొట్టమొదటి ట్యాబ్లెట్ రూపొందిస్తున్న వన్‌ప్లస్

-

మార్కెట్ లోకి రియల్‌మీ, ఒప్పో, వివో కంపెనీలు ఇప్పటికే తమ మొట్టమొదటి ట్యాబ్లెట్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా అదే పనిచేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో ఈ ట్యాబ్లెట్ మార్కెట్లో లాంచ్ కానుందట. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ దీనికి సంబంధించిన వివరాలను అందించారు. అవేంటో చూసేద్దామా..!
ఈ ట్యాబ్లెట్ మాస్ ప్రొడక్షన్ కూడా యూరోపియన్ దేశాల్లో ప్రారంభం అయింది. అంటే త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే ఈ ట్యాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానుంది.
 ఏ నెలలో ఏ వన్ ప్లస్ వేరియంట్స్ లాంచ్ కానున్నాయి..?
వన్‌ప్లస్ 2022 స్మార్ట్ ఫోన్ లైనప్ వివరాలు కూడా లీకయ్యాయి. వన్‌ప్లస్ 10 ప్రో ఈ నెలలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఏప్రిల్‌లో లాంచ్ చేయనున్నారు.. వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఏప్రిల్ నెలాఖరులో కానీ, మే ప్రారంభంలో కానీ లాంచ్ చేస్తారనేది సమాచారం.
వన్‌ప్లస్ 10ఆర్ మేలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 (వన్‌ప్లస్ నార్డ్ ప్రో) జులైలో లాంచ్ కానుంది. ఇక వన్‌ప్లస్ 10 అల్ట్రా లేదా వన్‌ప్లస్ 10 ప్రో ప్లస్ స్మార్ట్ ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో లాంచ్ చేయనున్నారు.. అయితే ఈ లిస్ట్‌కి మరిన్ని మోడల్స్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది.
వన్ ప్లస్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త వర్షన్స్ తో వస్తున్న ఈ ఫోన్లపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త ఫోన్ కొనాలకునేవారు.. ఓ సారి వీటిపై కూడా లుక్కేయండి. ఈ నెల 31న లాంచ్ కానున్న వన్ ప్లస్ 10 ప్రో కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సైట్ లో ఇవ్వబడ్డాయి. అదిరిపోయే ఫీచర్స్ తో ఫోన్ కస్టమర్స్ ను ఆకట్టుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news