రోగనిరోధక శక్తిని పెంచే చింత చిగురు.. రక్తహీనతకు చక్కటి పరిష్కారం

-

సమ్మర్ వచ్చిందంటే.. పల్లెటూర్లలో చింతచెట్లకు చిగురు విపరీతంగా వస్తుంది. ఇక అక్కడి మహిళలు చిన్నా పెద్దా తేడా లేకుండా.. చెట్టులు ఎక్కేసి.. చిగురు కోస్తుంటారు. వీటితో ఇక పప్పులు, ఫ్రైలు..ఎండుచేపలు వేసి చింతచిగురు ఫ్రే చేస్తే ఉంటది ఆ రుచి…అబ్బో..నెక్స్ట్ లెవల్. చిగురును కొన్ని కూరగాయల్లో కూడా కలిపి వండుతారు. అసలు చింతచిగురు ఎందులో కలిపినా అమోఘమే కదా.. ఇది టేస్ట్ చేసిన వారికే తెలుస్తుంది. మరీ ఇది రుచిని మాత్రమే ఇస్తుంది అనుకుంటున్నారేమో.. అంతకు మించి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు మనం త్వరలో దొరకబోయే చింతచిగురు గురించి తెలుసుకుందాం..
ఇది రక్తహీనతను నివారిస్తుంది. రక్తం పెరిగేలా చేస్తుంది.
చింత చిగురు కామెర్ల నివారణకు ఉపయోగపడుతుంది.
మూల వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది.
నేత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కీళ్ళవాపు సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.
చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటినాగా పనిచేసి విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. మల బద్ధకం సమస్యను తొలగిస్తుంది.
ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వారికి చింతపండు బాగా ఉపకరిస్తుంది.
చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి.
థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు.
శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
చింత చిగురులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడుతుంది.
వణుకుడు జర్వం తగ్గించటంలోనూ, గొంతునొప్పి, మంట, వాపుని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఇది రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. ఆర్ధరైటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.
శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
చింత చిగురు ఎక్కవగా దొరికిన సందర్భంలో కచ్చా..పక్కాగా రుబ్బుకుని వడల అకారంలో చేసి ఎండ బెట్టుకోవాలి. ఎండిన వాటిని డబ్బాలో భద్రపరుచుకోవాలి. నెలరోజులకు పైగా నిల్వ ఉంటాయి. కూరల్లో చింతపండుకు బదులు వీటిని వేసుకోవచ్చు. సిటీల్లో ఉండే వారికి ఇది దొరడం కష్టం కావొచ్చు. ఇప్పుడు పల్లెల్లో వాళ్లు కూడా కోసి.. సిటీల్లో అమ్ముతున్నారు. కాబట్టి.. చింతచిగురు కనిపిస్తే.. అస్సలు వదలకుండా వాడేయండి. ప్రకృతి మనకు ఏ కాలంలో ఏది అవసరమో ఆకాలంలో అది ఇస్తుంది. కాబట్టి.. చింతచిగురే కదా అని చీప్ గా అనుకుంటారేమో.. చూశారు కదా పోషక విలువలు ఎన్ని ఉన్నాయో..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news