భాజపా అంటే మండి పడుతున్నారు తెలంగాణ సిఎమ్ కేసీఆర్. ఆయనకు అత్యంత సన్నిహితులు మై హోమ్ అధినేతలు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందని వార్తలు వినిపిస్తూ, కనిపిస్తూ వస్తున్నాయి.
చినజీయర్ స్వామి ఉదంతం నుంచీ ఈ ఎడం అన్నది ప్రారంభమైందని అందరూ అనుకుంటున్న విషయం. అయితే ఎటు వైపు నుంచీ దీనిపై క్లారిటీ లేదు. ఖండన లేదు. అయితే అలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
చినజీయర్, మైహోమ్ భాజపాకు దగ్గరవుతున్నారని, అక్కడే కేసీఆర్ తో పొసగలేదని కూడా గుసగుసలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మై హోమ్ రామ్ ఒక్కసారిగా ఢిల్లీలో కేంద్ర హోమంత్రి దగ్గర ప్రత్యక్షమయ్యారు.ఆయన సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనగనమణ అనే సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నిర్మాణ టీమ్ మొత్తం కేంద్ర హోమంత్రిని కలిసింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. విడుదల వచ్చే ఏడాది. మరి ఇప్పుడు ఎందుకు కలిసింది అన్నది పెద్ద ప్రశ్న కాదు. కానీ ఈ కలయిక ఎలా సాధ్యమైంది అన్నది పాయింట్.
మై హోమ్ రామ్ వల్లనే ఇది సాధ్యమైందని బోగట్టా. లేదూ అంటే ఇది సాధ్యం కాదు. చూస్తుంటే మైహోమ్ అధినేతలు భాజపాకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.