రాజశేఖర్ ‘కల్కి’ టీజర్.. అ!ద్భుతహా..!

-

యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ గరుడవేగ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా రాజశేఖర్ కెరియర్ మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేలా చేసింది. ఇక ఆ సినిమా తర్వత కొద్దిపాటి గ్యాప్ తోనే ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రాజశేఖర్. కల్కి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా దేవుడి పదవ అవతారం అంటూ ప్రచారం చేస్తున్నారు. టీజర్ చూస్తే నిజంగా మళ్లీ ప్రశాంత్ వర్మ మరో అద్భుతాన్ని సృష్టించాడని అనిపిస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా రాజశేఖర్ కెరియర్ లో మరో సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news