తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్పుల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. కాగ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. సమ్మక్క – సారలమ్మ జాతర నుంచి వీరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.
సమ్మక్క – సారలమ్మ జాతర సమయంలో గవర్నర్ తమిళి సై ప్రోటోకాల్ అంశంపై పెద్ద రచ్చ నే చోటు చేసుకుంది. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే.. జరిగియి. అప్పుడు కూడా పెద్ద వివాదం జరిగింది. అలాగే ఇటీవల ఉగాది సందర్భంగా రాజ్ భవన్ లో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులకు కూడా గవర్నర్ ఆహ్వానం పంపించారు. అయితే ఈ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా దూరంగానే ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.