ఒప్పో నుంచి తాజాగా రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. Oppo F21 Pro 5G, Oppo F21 Pro 4G.
ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటలకు ఈ ఫోన్లు భారత్‌లో లాంచ్ అవనున్నాయి. విడుదలకు ముందే ఈ మొబైళ్లకు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు బహిర్గతమయ్యాయి. ఇంకెందుకు ఆలస్య వివరాలు చూసేద్దామా..!
Oppo F21 Pro Series అంచనా ధర :
ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.21,990గా ఉండనుంది.
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే ఒప్పో ఎఫ్21 5జీ ధర రూ.25,990గా ఉండే అవకాశం ఉంది.
Oppo F21 Pro Series స్పెసిఫికేషన్లు అంచనా
ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీ, ఫ్రంట్ కెమెరా మినహా Oppo F21 Pro 5G, Oppo F21 Pro 4G మోడళ్లు ఒకే స్పెసిఫికేషన్లతో వచ్చే అవకాశం ఉందట..
6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేలతో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయనేది సమాచారం.
ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ వేరియంట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండనుంది.
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.
4జీ మోడల్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై రన్ అవుతుందనే సమాచారం లీకైంది.
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక వెనుక మూడు కెమెరాల సెటప్ ఉండనుండగా.. ప్రధాన సెన్సార్ 64 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంటుందని సమాచారం.
4500 బ్యాటరీ ఉండనుండగా.. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయట.
టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ అందించిన సమాచారం ప్రకారం.. వివరాలను అందించటం జరిగింది. దాదాపు ఇవే ఫీచర్స్ తో ఫోన్లు రిలీజ్ కానున్నాయి.