బిజినెస్ ఐడియా: బర్గర్ బిజినెస్ తో తొమ్మిది కోట్లు సంపాదిస్తున్న టెక్కీ..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. ఉద్యోగాలని వదిలేసి వ్యాపారాల పై మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే వ్యాపారంలో ఆదాయం ఎక్కువగా వస్తుంది. పైగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఎవరి రూల్స్ వాళ్లే రాసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఎలా అయితే వ్యాపారం చేస్తున్నారో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉద్యోగం కంటే వ్యాపారమే బెస్ట్ అని అనుకున్నారు.

 

దీనితో బిజినెస్ ని మొదలు పెట్టాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… బర్గర్స్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు. ఈయన పేరు బిరాజా. ఇతనికి మొదట్లో వ్యాపారం పై ఎలాంటి అనుభవం లేదు. కానీ అతను యూట్యూబ్ ద్వారా బర్గర్ల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా యూఎస్ఏ మరియు జర్మనీలో బర్గర్ల తయారీ వంటివి చూసేవాడు. భారతదేశంలో ఎక్కువగా వేయించిన ఫ్యాటీ బర్గర్ లు ఉంటాయి అయితే తాను బర్గర్ల పై ఎంతో నాలెడ్జ్ ని పెంచుకుని మొత్తానికి ఈ బిజినెస్ ని మొదలు పెట్టారు.

హోమ్ చెఫ్ ని కూడా అతను నియమించారు. బిగ్గీస్ బర్గర్‌ని ప్రారంభించడానికి ఒక ఫాబ్రికేటర్ నుండి కియోస్క్‌ని కొనుగోలు చేశాడు చేశాడు. నాలుగు ఫ్రాంచైజీలు అతనికి ఉన్నాయి. బెంగళూరులో రెండు రాయిపూర్ మరియు భువనేశ్వర్ లో ఒకటి ఉన్నాయి. ఉద్యోగాన్ని వదిలిపెట్టి అతను ఈ బిజినెస్ ని మొదలు పెట్టాడు తన స్నేహితులు కూడా ఇదే విధంగా ఉద్యోగాలను వదిలిపెట్టారు. ఈ బర్గర్స్ కోసం గోధుమ బన్స్ ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం 12 రకాల బర్గర్లను ఇస్తున్నారు 8.9 కోట్ల ఆదాయం వస్తోంది. ఒక బర్గర్ ధర 150 నుంచి 200 వరకు ఉంటుంది. ఇలా బర్గర్ల వ్యాపారంతో మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news