అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి…. టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా ? అంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవని సీఎం జగన్ కు చురకలు అంటించారు.
మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పని చేస్తున్నామని.. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దామని సవాల్ విసిరారు నారా లోకేష్. వేళాపాలా లేకుండా కరెంటు తీయడమేంటని ప్రశ్నించడమేనా శావల్యాపురం మండలం కారుమంచి టిడిపి కార్యకర్తలు చేసిన నేరం? టిడిపి నేతల రక్తం కళ్లజూసిన వైసీపీ మూర్ఖులారా..మీకు సమయం దగ్గర పడుతోందని నిప్పులు చెరిగారు.