2014 ముందే పార్టీ స్థాపించినా ఐదేళ్ల వరకు వెయిట్ చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఈసారి ఏపి ఎలక్షన్స్ లో గట్టి పోటీ ఇవ్వాలని అనుకున్నాడు. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలే కాకుండా తను కూడా ఓ ప్రభంజనం సృష్టించాలని చూశాడు. పవన్ మీటింగ్ పెడితే వచ్చే జనాల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, వారంతా కేవలం పవన్ ను చూసేందుకు మాత్రమే వచ్చారని చెప్పుకోవచ్చు.
ఈ టైం ఏపిలో అత్యధిక శాతం ఓటింగ్ పవన్ కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అయితే అలా అని కూడా చెప్పడం కష్టమని టాక్. ఇదిలాఉంటే ఇప్పటికే ఏపిలో రిజల్ట్ ఏంటన్నది డిసైడ్ అయ్యినట్టే అంటున్నారు. ఇక ఆఫ్టర్ రిజల్ట్ పవన్ పరిస్థితి ఏంటి అన్నది తనకు సీన్ అర్ధమైంది కనుకే మళ్లీ అడ్వాన్స్ తీసుకున్న సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నట్టు టాక్.
ఒక్క సీట్ వచ్చినా జనసేనని నిలుపుతాడని అనుకున్న జనసైనికులకు షాక్ ఇస్తూ తన పనేదో తాను చూసుకునేందుకు సిద్ధమయ్యాడట పవన్. తను పోటీ చేసిన రెండు ప్రాంతాల్లో కూడా గట్టి పోటీ ఉంది. అక్కడ పవన్ నెగ్గడం కష్టమే అంటున్నారు. అందుకే ఇక మళ్లీ సినిమాల వైపు గాలి మళ్లిందట. 2014లో కూడా ఇలా వచ్చి అలా వెళ్లిన పవన్ ఈసారి కొద్దిగా ప్రయత్నం చేసినా మళ్లీ రిజల్ట్స్ తర్వాత సినిమాలకే అంకితం అవుతాడని కొందరి మాట. ఫలితాలు ఎలా ఉంటాయి ఆ తర్వాత పార్టీ పరిస్థితి ఏంటన్నది చూడాలి.