దేవుడి హారతిని కళ్లకు అద్దుకోవద్దట.. ఎందుకంటే?

54

దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి పడకుండా మనం పిల్లలకు.. ఎక్కడి నుంచైన వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తాము కదా.

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

should we give an obeisance to aarti or not

దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి పడకుండా మనం పిల్లలకు.. ఎక్కడి నుంచైన వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తాము కదా. అలాగే దేవుడికి దిష్టి తగలకుండా హారతి ఇస్తారట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే. అయితే చాలా మంది ఎందుకు హారతి ఇస్తారు అనే విషయం తెలియదు.

దేవుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్లకు అద్దుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దిష్టి తీసిన హారతి.. అందుకే దాన్ని కళ్లకు అద్దుకున్నా కూడా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని పండితులు చెబుతున్నరు. దిష్టి తీసిన గుమ్మడి కాయను మనం ఎలా బయటపడేస్తామో… ఇది కూడా అలాంటిదేనట. హారతి ఇవ్వడం పూర్తవగానే ఆ హారతిని అక్కడ పెట్టేస్తారు. తర్వాత అది ఆరిపోతుంది.