బుల్లితెర స్టార్ యాంకర్ సుమ అని చెప్పొచ్చు. ఇన్నాళ్ల పాటు టెలివిజన్ లో సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ప్రేక్షకులను, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన సుమ.. ఇక వెండితెరపైన ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో హడావిడి చేసేస్తోంది సుమ.
ఈ నెల 16న ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన యాంకర్ సుమ.. ఆ ట్రైలర్ ను జనసేనాని పవన్ కల్యాణ్ లాంచ్ చేస్తారని తాజాగా తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా గ్రా మ్ వేదికగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఫొటోతో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది. 16న 11.07 గంటలకు పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు.
విజయ్ కుమార్ కనకవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. గ్రామ పెద్దగా యాంకర్ సుమ ఇందులో నటించింది. సినిమా ఎక్స్ ట్రార్డినరీగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫీచర్ ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్పిరేషన్ తో ఫిక్షనల్ స్టోరిని తెరకెక్కించినట్లు చెప్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
https://www.instagram.com/p/CcXpQzWpSVi/?utm_source=ig_web_copy_link