ఆర్టికల్ 370 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. సాంబా జిల్లాలో పల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలో పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో పాటు మరికొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని పర్యటన సందర్భంగా ఆర్మీ, జమ్మూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తాజాగా ప్రధాని పర్యటన ముందు జమ్మూలో బ్లాస్ట్ జరిగింది. ప్రధాని సందర్శించే గ్రామానికి 12 కిల్లోమీటర్ల దూరంలోని బిష్నా ప్రాంతంలో పేలుడు సంభవించింది. లాలియన్ గ్రామలోని వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు మరింతగా సెక్యురిటీ టైట్ చేసి…క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
అంతకుముందు ఒక రోజు ముందు కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లోె ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన టెర్రిరిస్టులను హతమార్చారు.