మంత్రి అమర్నాథ్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఫైర్

-

ఏపీలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మంత్రి అమర్నాథ్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఆరోపణలు చేశారు. అనకాపల్లి అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే మంత్రి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. బినామీలతో అవినీతికి పాల్పడుతూ మంత్రి నీతి కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు.

వాల్తేర్ డివిజన్ విశాఖ రైల్వే జోన్ లోనే ఉండాలి - మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్

ఆర్ఇసిఎస్ లో కుంభకోణం, విసన్నపేటలో భూములు కబ్జా, క్వారీలలో అక్రమాలకు పాల్పడింది మంత్రే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మీద కక్ష తో నా కొడుకు పై అక్రమ కేసులు పెట్టించావు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అమర్నాథ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బినామీ మంత్రివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి ప్రజలే రానున్న రోజుల్లో తగిన బుద్ది చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news