కరోనా పై మరింత సమర్థవంతంగా పోరాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 15 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే తాాజాగా 12 ఏళ్లుకు పైబడిన, 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. తాజాగా కార్బెవాక్, కోవాగ్జిన్, జైకోవ్ డీ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానిక అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
5-12 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ‘కోర్బెవాక్’ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అలాగే 6-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు భారత్ బయోటెక్ సంస్థ తయారీ వ్యాక్సిన్ ‘ కోవాగ్జిన్’ కు కూడా అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. ఇదే విధంగా 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు జైడస్ కాడిలా సంస్థ తయారీ వ్యాక్సిన్ ‘ జైకోవ్ డీ’ వినియోగానికి అత్యవసర అనుమతులను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఇండియా కోవిడ్ పై మరింత సమర్థవంతంగా పోరాడునుంది.