కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక సర్కారు బడుల్లో ‘హెల్త్ అంబాసిడర్లు’

-

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించడానికి హెల్త్‌ అంబాసిడర్లను నియమించనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా.. తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీరిని నియమించాలని నిర్నయం తీసుకుంది.

తొలి విడతలో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌, కోమురం భీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మంచిర్యాల, సిద్దిపేట, రాజన్న సిరిసిల్లా, సంగారెడ్డి జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో ఎంపికైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు హెల్త్‌ అంబాసిడర్లు గా వ్యవహరిస్తారు. వీరు తమ పరిధిలోని విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news