తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆ పార్టీ నేతలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఎన్నికల్లో కూడా కొందరు కోవర్ట్ ఆపరేషన్ చేశారని, నిజామాబాద్ లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కోమటిరెడ్డి నిజామాబాద్ వస్తా అంటే స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండి.. హుజూర్ నగర్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో బలంగా ఉన్నాం అని వాపు చూసి బలుపు అనుకోవద్దని ఆయన మండిపడ్డారు. అంతర్గత అంశాలపై పీఏసీలో చర్చ చేస్తామని ఆయన వెల్లడించారు.
అయితే టీ కాంగ్రెస్ పరిణామాలు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఈ రోజు బాగున్న నేతలు రేపు ఎడముఖం పెడముఖం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు టీపీసీసీ రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరుకాకపోవడంతో మరింత గందరగోళం మొదలైంది. దీంతో పాటు నల్గొండ పర్యటనకు రేవంత్రెడ్డి రానవసరం లేదని ఉత్తమ్, కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం కూడా పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.