ఐపీఎల్-2022లో నేడు మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ఎంసీఏ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 13 పరుగల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అయితే.. లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. డికాక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీపక్ హుడా 34 పరుగులు చేశాడు. చివర్లో దుశ్మంత చమీర రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ 4, రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 154 స్వల్ప స్కోరులాగే కనిపించినా.. పంజాబ్ టార్గెట్ చేరుకోవాలంటే.. 154 చేయాలి.. మొదటి నుంచి అన్ని మ్యాచ్‌ల్లో పటిష్ట ఆటను కనబరుస్తున్న లక్నో, పంజాబ్ జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందోనని.. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.