తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త..12,735 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

-

తెలంగాణ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 12735 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఈ నియామకాల్లో వెయిటేజీ అంశం పై అధికారులు దృష్టిపెట్టారు.

ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వగా… కొత్తగా 50 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యులు సహా అన్ని విభాగాల ఉద్యోగాలకు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సీనియారిటీ వెయిటేజీ 10 శాతానికి పెంచుతామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ పోస్టులకు అప్లై చేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మళ్లీ ఫోర్త్ వేవ్ కరోనా విజృంభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే..  వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలలను ఈ విధంగా భర్తీ చేసేందుకు.. ఈ నిర్ణయం కేసీఆర్ సర్కార్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news