ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం..సర్వదర్శనాలపై కీలక ప్రకటన

-

ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా 64 అంశాలతో అజెండాను రూపొందించిన అధికారులు… టెబుల్ అజేండాగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. వారపు ఆర్జిత సేవలు తాత్కాలికం గా రద్దు చేయనుండగా… సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ చేయనుంది. దివ్యదర్శనం టోకెన్లు పునః ప్రారంభం చేయనుండగా…..వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్ల పై నిర్ణయం తీసుకోనుంది.

గరుడ వారధి,శ్రీవాణి ట్రస్టు విరాళాలతో నూతన ఆలయాల నిర్మాణంకు నిధులు కేటాయింపులు చేయనున్నారు అధికారులు. స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల సౌకర్యార్ధం షెడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయింపు చేయనుండగా….ఎల‌క్ట్రిక్ బ‌స్ స్టేష‌న్ తో పాటు ఎల‌క్ట్రిక్ ఛార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయనున్నారు. ఆప్కో మెగా షోరూం ఏర్పాటు, ఇళ్లు,దుకాణాలు లీగ‌ల్ హైర్‌, కొనుగోలు చేసిన వారి లైసెన్సుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌పై నిర్నయం తీసుకోనున్నారు.

చాలా ఏళ్లుగా వివాదంలో వున్న 84 టెండర్ షాపుల కేటాయింపులు చేయగా… యాక్సిస్ బ్యాంకు ఈ-లాబీ ఏర్పాటు చేయనున్నారు. అన్నమయ్య మార్గంలో నడకదారీ, రోడ్డు మార్గం ఏర్పాటు పై అటవీ శాఖ నివేదిక పై చర్చ జరుగనుండగా.. అటవీ శాఖ సిబ్బందికి టైం స్కేల్ వర్తింపు పై నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీలో ఖాళీగా వున్న క్వార్టర్స్ ను కార్పోరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు కేటాయింపు పై నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news