పోలీసుల్లో కొందరు ఆ డిపార్టుమెంటుకు మంచి పేరు తెస్తుంటే.. మరి కొందరు.. ఆ పేరును చెడగొడుతున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ పోలీసు. వివరాల్లోకి వెళితే.. బీహార్ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాహర్ అవుట్‌పోస్ట్‌లో శశిభూషణ్ సిన్హా విధులు నిర్వహించే సీనియర్ అధికారి.. అయితే ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను అవుట్‌పోస్ట్‌లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్‌కు పిలిపించుకుని, ఆపై ఆమెతో బలవంతంగా మసాజ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
షర్ట్‌ను అక్కడే వేలాడదీసి.. ఆపై ఆమెతో ఒళ్లు బాగా పట్టించుకున్నాడు. ఆ టైంలో ఆయన సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతుండగా.. ఎవరో ఆయన్ని వీడియో తీశారు. ఆ టైంలో అక్కడ మరో మహిళ కూడా ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. ఆయనపై వేటు పడింది. బీహార్‌లో విధి నిర్వహణలో ఉండగానే మసాజ్ దుకాణం తెరిచిన ఓ పోలీస్ అధికారి వీడియో ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్‌ల్లో విపరీతంగా వైరల్ అయ్యింది.