మరో సారి రాధికా, చిరంజీవి జంటగా సినిమా..

-

మెగాస్టార్ చిరంజీవి, రాధికా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు ఓ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించబోతుంది. కానీ హీరో హీరోయిన్లు గా కాదు.. చిరంజీవి హీరోగా నటించే కొత్త చిత్రానికి రాధిక నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాధిక స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

Chiranjeevi: తన డ్రీమ్ హీరోయిన్ రాధికకు బంపర్ అఫర్ ఇచ్చిన మెగాస్టార్.. ఆనందంలో రాధికా శరత్ కుమార్! | News Orbit

తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నాడని వివరించారు. తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాధిక పేర్కొంది. అయితే ఇప్పటికే రాధికా రాడాన్ మీడియా వర్క్స్ పై సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే రాధికా, చిరంజీవి కాంబోలో సినిమా అంటే.. మరోసారి మెగా అభిమానులకు ఆసక్తి నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news