బిగ్ బాస్ 3 లో యాంకర్ ఉదయ భాను.. భారీ పారితోషికం.. కంటెస్టంట్ల లిస్ట్ ఇదే..!

-

సాహసం చేయరా డింబకా, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు, వన్స్ మోర్ ప్లీజ్ లాంటి టీవీ షోలతో తెలుగు సినిమా అభిమానులకు బాగా దగ్గరయింది ఉదయ భాను. అయితే… పెళ్లి తర్వాత ఆమె యాంకరింగ్ చేయడం లేదు.

బిగ్ బాస్.. రియాల్టీ షో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తవడంతో మూడో సీజన్ కోసం మాటీవీ సమాయత్తమవుతోంది. 2017లో తెలుగులో ప్రారంభమైన ఈ షోకు మంచి రెస్పాన్సే వచ్చింది. ముందు జూనియర్ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకున్నారు. రెండో సీజన్ కు నాచురల్ స్టార్ నానీని హోస్ట్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఎవరిని హోస్ట్ గా తీసుకుంటారో తెలియనప్పటికీ.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ల పేర్లు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే పలు పేర్లు ఖరారు అయినట్టు వార్తలు వస్తుండగా.. తాజాగా యాంకర్ ఉదయ భానును కూడా బిగ్ బాస్ సీజన్ 3 లో తీసుకుంటున్నారట.

Anchor Udaya bhanu in bigg boss season 3?

ఆమె సాహసం చేయరా డింబకా, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు, వన్స్ మోర్ ప్లీజ్ లాంటి టీవీ షోలతో తెలుగు సినిమా అభిమానులకు బాగా దగ్గరయింది. అయితే… పెళ్లి తర్వాత ఆమె యాంకరింగ్ చేయడం లేదు. కాకపోతే.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ షోతో టీవీ రంగంలో అడుగుపెట్టబోతున్నదని వార్తలు వస్తున్నాయి.

ఆమెను బిగ్ బాస్ సీజన్ 3 లో తీసుకోవడం కోసం భారీ పారితోషికమే ముట్టజెప్పారట. ఆమె ఉంటే కాస్త ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాంట్రవర్సీలు కూడా ఉంటాయని ఆమెను షో నిర్వాహకులు భారీ మొత్తం ముట్టజెప్పి ఒప్పించారట.

మొత్తం వందరోజులకు గాను ఆమె రోజుకు 2 లక్షల లెక్క ప్రకారం.. 2 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అమ్మో… ఈ లెక్క ప్రకారం చూసుకుంటే.. ఉదయ భానుకు భారీ ధర పలికినట్టే కదా. బిగ్ బాస్ తెలుగు సీజన్ లోనే ఇంత భారీ పారితోషకంతో వచ్చిన కంటెస్టంట్ లేరని ఇండస్ట్రీ గుసగుసలాడుతోంది.

ఇక.. ఇప్పటికే కంటెస్టంట్లు కూడా ఫైనల్ అయ్యారని.. వాళ్లలో 13 మంది వీళ్లేనని వార్తలు వస్తున్నాయి. వాళ్లు ఎవరో మీరే చూడండి..

1. సుడిగాలి సుధీర్
2. యాంకర్ రష్మి
3. టీవీ నటి హరిత
4. వరుణ్ సందేశ్
5. హేమ చంద్ర
6. యాంకర్ ఉదయభాను
7. హీరో కమల్ కామరాజు
8. రేణు దేశాయ్
9. గుత్తా జ్వాల
10. మనోజ్ నందన్
11. జబర్దస్త్ పొట్టి రమేష్
12. కొరియోగ్రాఫర్ రఘు
13. బిత్తిరి సత్తి
14. కామన్‌మెన్
15. కామన్ ఉమెన్

Read more RELATED
Recommended to you

Latest news