ఏం ఎండరా బాబు.. చంపేస్తోంది అంటారా? అయితే ఈ ఎండ వేడిలో సేద తీరడానికి, ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి మీరు చేయాల్సింది ఒకటే. చిటికెలో చేసేసుకోవచ్చు. అదే పుదీనా షర్బత్. దాన్నే ఇంగ్లీష్ లో మింట్ జ్యూస్ అని పిలుస్తారు. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పుదీనా ఆకులు, నిమ్మకాయ, తేనె లేదా చక్కెర, కొన్ని చల్లని నీళ్లు, జీలకర్ర పొడి బ్లాక్ సాల్ట్, చిన్న ఐస్ ముక్కలు ఉంటే చాలు పుదీనా షర్బత్ ను చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి. దాంట్లో చక్కెర, తేనె కలపండి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఓ గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసి, పుదీనా రసాన్ని అందులో పోసి నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మండుటెండలో తాగేస్తే కడుపులో చల్లగా ఉంటుంది.