శ్రీలంక బాంబు పేలుళ్లకు ముందు.. బాంబు బ్యాగుతో ఉగ్రవాది.. వీడియో

-

నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చీలో బాంబు పేలడానికి సరిగ్గా కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగుతో లోపలికి వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వ్యక్తే ఉగ్రవాది అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రపంచంలోనే ఇంత దారుణాతి దారుణమైన బాంబు పేలుళ్లు ఎక్కడా చోటు చేసుకోలేదు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు 300 మందిని పొట్టన పెట్టుకోగా.. 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కర్కశత్వానికి నిదర్శనం ఈ ఘటన.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, ప్రాణాలు దక్కించుకున్న వాళ్ల కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా.. నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చీలో బాంబు పేలడానికి సరిగ్గా కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగుతో లోపలికి వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వ్యక్తే ఉగ్రవాది అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.



ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చిన తర్వాత, బాంబు పేలడానికి ముందు సీసీటీవీ కెమెరా పని చేయలేదు. అయితే.. భారీ బ్యాగుతో ఉన్న వ్యక్తే ఆ చర్చీలో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఐసీస్ తీవ్రవాద సంస్థకు చెందిన 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news