చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు : అశ్రీన్‌

-

రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు అనే యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన అశ్రీన్‌ యువతి (23) కళాశాలలో స్నేహితులు. అయితే వారి స్నేహం కాస్తా ప్రేమగామారడంతో ఓల్డ్‌ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ఈ ఏడాది జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకున్న జంట సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ వైపు వెళుతుండగా.. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్‌ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో.. యువకుడు తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

murder

ఈ నేపథ్యంలో అశ్రీన్‌ మాట్లాడుతూ.. నా భర్త నాగరాజు తలపై విచక్షణారహితంగా కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేసింది. నాగరాజును కొట్టేటప్పుడ నేను నాగరాజు అంటూ అతని మీద పడ్డానని, నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా దాడి చేశారని తెలిపింది. అక్కడున్నవారిని కాళ్లు పట్టుకుని కాపాడమని అడిగినా.. కానీ ఎవరూ ముందుకు రాలేదు అంటూ ఆమె వాపోయింది. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు.. పదేళ్ల నుంచి నాగరాజు తో నాకు పరిచయం ఉంది.. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజు కు కూడా చెప్పాను.. 3 నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను.. చివరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను.. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు.. నాకు న్యాయం చేయాలని అశ్రీన్ పోలీసులను కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news