అక్రమ రేషన్ కార్డులు ఉన్న వారికి షాక్… త్వరలో వారి రేషన్ కార్డులు తొలగింపు

-

రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదల కడుపు నింపుతోంది ప్రభుత్వం. నేషనల్ ఫుడ్ సెక్యురిటీ పథకం కింది తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. అయితే కొంతమంది మాత్రం ఆర్థిక స్థోమత, ఆస్తులు ఉన్నా కూడా అక్రమ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. భూములు, ఆస్తులు, వాహనాలు ఉండీ కూడా పేదవారిగా చలామణీ అవుతూ అక్రమంగా రేషన్ పొందుతున్నారు. ఇలాంటి వారి రేషన్ కార్డులు తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా ఇప్పటికే రూపొందించారు.

ration-cards
ration-cards

ఒక వ్యక్తికి 100 చదరపు మీటర్లలో ప్లాట్ లేదా ఇళ్లు, ఫోర్ వీలర్ లేదా ట్రాక్టర్, పట్టణాల్లో అయితే 3 లక్షలు, అంతకు మించి ఆదాయం, గ్రామాల్లో వార్షిక  ఆదాయం రెండు లక్షలు అంతకన్నా ఎక్కువగా ఉంటే వారు అనర్హులుగా ప్రకటించనున్నారు. వీరు తమ రేషన్ కార్డులను ఎమ్మార్వో లేదా డిస్ట్రిక్ సివిల్ సప్లై ఆఫీసుల్లో అప్పగించాలి. అలా చేయకుండా ఉంటే కుటుంబంపై చట్ట ప్రకారం చర్యలతో పాటు తీసుకున్న రేషన్ రికవరీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news