శ్రీకాకుళం జిల్లా నుండి జిల్లాల పర్యటన మొదలు పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు భారీగా పెంచారు, విద్యుత్తు ఉండదు కానీ, బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. నేను ఫైబర్ నెట్ రూ. 140కి ఇస్తే..రూ.290కి పెంచారని మండిపడ్డారు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్ల వల్ల నాటుసారా పెరిగిందన్నారు. నేను జగన్ లా దోచుకోలేదు..దాచుకోలేదుఅన్నారు.
జగన్ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదన్నారు. వారంలో ఐదు ఘటనలు, నెలలో 30 సంఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని..151 సీట్లు రావడంతో జగన్కు అహంకారం పెరిగిందని ఆక్షేపించారు. నా ఇంటి పై దాడి చేయడమే కాకుండా అసెంబ్లీలో నన్ను అవమానించారు, నా కుటుంబ సభ్యులను అవమానించారు అని చంద్రబాబు వాపోయారు. జగన్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.