ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్‌ను కోట్ చేస్తూ దానికి రీ ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణకు టూరిస్టులు వస్తుంటారు, వెళుతుంటారు అంటూ కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్వీట్ చేయగా.. చేయగా.. ఈ ట్వీట్‌పై వేగంగా స్పందించిన రేవంత్ రెడ్డి… కేటీఆర్ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చంటూ కీలక వ్యాఖ్య చేశారు.
తెలంగాణను కేటీఆర్ టూరిస్ట్ ప్లేస్‌గా పరిగణిస్తుంటే… తాము మాత్రం ఈ రాష్ట్రం అమర వీరుల త్యాగఫలంగానే భావిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. . నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెస్సేనని ఘాటు రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి.