సీతమ్మధార క్షత్రియ కల్యాణమండపంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కిషన్ రెడ్డి హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్టమని, అలాగే అల్లూరితో కలసి బ్రిటీష్ వారితో పోరాటం చేసిన కుటుంబాలను గుర్తించి.. వారి వారసుల పిల్లలకు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కిషన్‌రెడ్డి. లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియంను ఏడాదిలోపు ఏర్పాటు చేస్తామని, అల్లూరి 125వ జయంత్యుత్సవాలను ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు దేశ వ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి.