యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి జరిగింది. యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ రెడ్డి ని టాలీవుడ్ సినీ నటి కరాటే కల్యాణి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళల పై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడు అంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడు అంటూ దాడి చేసింది సినీ నటి కరాటే కల్యాణి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను రెచ్చగొట్టి శ్రీకాంత్ రెడ్డి.. కోరికలు తీర్చుకుంటున్నట్లు సమాచారం అందుతోదంఇ. ఈ నేపథ్యంలోనే.. శ్రీకాంత్ రెడ్డి బట్టలు ఉడదీసి రోడ్ల పై పరుగేంతించి కొట్టింది కరాటే కల్యాణి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కరాటే కల్యాణి పై శ్రీకాంత్ రెడ్డి దాడి చేశాడు. ప్రస్తుతం యూసఫ్ గూడ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.