ఏపీ, తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం అందరికి తెలుసు..ఇప్పటికే పరీక్షలు మొదలై కొన్ని పరీక్షలు కూడా అయిపోయాయి..అయితే తెలంగాణ ప్రశ్నా పత్రాలలో కొన్ని పోరాపాట్లు దొర్లిన విషయం అందరికి తెలుసు. బోర్డు నిర్వాహుకులు ఇప్పుడు మరో తప్పు చేశారు.గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం పొలిటికల్ సైన్స్ పరీక్షలో… తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఓ ప్రశ్న వేర్వేరుగా వచ్చింది. ప్రశ్నపత్రంలోని సెక్షన్-బి, ప్రశ్న నంబరు-8లో… ఇంగ్లీషు మీడియం పేపర్‌లో ‘1947 భారత స్వాతంత్య్ర చట్టంలోని ముఖ్యాంశాలు రాయండి’ అనే ప్రశ్న ఇచ్చారు.
తెలుగు మీడియం పేపర్ లో మాత్రం వేరే ప్రశ్న ఇవ్వడం పై ఆరోపణలు ఎదురవుతున్నాయి.భారత స్వాతంత్య్ర పోరాటంలో హోంరూల్ ఉద్యమాన్ని వర్ణించండి’ అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు 5 మార్కులు కేటాయించారు. ఇలా తెలుగులో ఒక ప్రశ్నను, ఇంగ్లీషు మీడియంలో మరో ప్రశ్నను ఇవ్వడం ద్వారా విద్యార్థులు నష్టపోతారని కొందరు ప్రముఖులు, తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ విషయం పై బోర్డు అధికారులు స్పందించారు..ఇంగ్లీషు, తెలుగు మీడియం పేపర్లను విడివిడిగా మూల్యాంకనం చేస్తామని, విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని బోర్డు కార్యదర్శి ప్రకటించారు.నిన్న జరిగిన పరీక్ష కు 95.1 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,39,171 మంది హాజరవ్వాల్సి ఉండగా, 4,17,295 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగతా 21,876 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే గురువారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మాల్ ప్రాక్టీస్ కేసులను నమోదు చేసినట్లు సమాచారం.