తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా చాలా మంది పోయారు. అంతేకాదు ఉద్యోగాలను కూడా చాలా మంది వదిలేసారు. వాటిని భర్తీ చేసెందుకు అధికారులు అన్నీ చర్యలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వివిధ శాఖలలో ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. తాజాగా మరో నోటిఫికేషన్ ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది..
నీటిపారుదల శాఖలో 1583 ఉద్యోగాలను భర్తీకి అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు..ఈ శాఖలో 704 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా… స్కిల్డ్ కేటగిరీలో 879 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఆమోదముద్ర పడనుంది. స్కిల్డ్ కేటగిరీలో వర్క్ ఇన్‌స్పెక్టర్, ఎలక్ట్రిషీయన్, ఫిట్టర్, ఫ్లడ్ గేట్ ఆపరేటర్, జనరేటర్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్, వైర్‌లెస్ ఆపరేటర్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆద్వర్యంలో జరగనుంది.ఏఈఈ పోస్టులకు బీటెక్ విద్యార్థులు అర్హులు..త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.