అదృష్టమంటే నీదే బాస్.. అప్పుడు ముంబైలో, ఇప్పుడు లంకలో బాంబు పేలుళ్ల నుంచి తప్పించుకున్నాడు..!

-

అయితే.. ముందుగా హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అనంతరం చర్చికి వెళ్దామని ఆ జంట అనుకున్నారు. తర్వాత ఎందుకో మనసు మార్చుకొని చర్చికి ముందు వెళ్లి రావడంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.

కిస్మత్ రా బయ్ కిస్మత్. అది మంచిగ లేకుంటే ఏం చేయలేం. అది మంచిగుంటే అంతా మంచే జరుగుతది.. అని అంటుంటారు కొందరు. మరికొందరు.. అరె.. అదృష్టవంతుడిని ఎవ్వరూ ఏం చేయలేరు. అదృష్టం ఉండాలె దేనికైనా. అది ఉంటే చాలు.. ఏపని అయినా ఇట్టే అయిపోతుంది.. ఇదిగో ఇలా అదృష్టం గురించి వంద మాటలు మాట్లాడుతరు. మన టైం బాగుంటే మన పక్కన బాంబు పేలినా ఏం కాదు అంటారు.

NRI escaped from srilanka bomb blasts

సరే.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇటీవల శ్రీలంకలో ఉగ్రమూక బాంబు పేలుళ్ల మోత మోగించిన సంగతి తెలిసిందే కదా. ఉగ్రదాడిలో 320 మందికి పైగా మృతి చెందగా… 500 మంది దాకా గాయపడ్డారు. అయితే.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తికి, శ్రీలంక బాంబు పేలుళ్లకు సంబంధం ఉంది. కానీ.. ఆ వ్యక్తి బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

అభినవ్ చారి.. ఎన్నారై. దుబాయ్ లో ఉంటాడు. ఆయన ఒక్కసారి కాదు.. ఇప్పటికే రెండు సార్లు ఉగ్రదాడులను తప్పించుకున్నాడు. తన భార్య నరూప్ తో కలిసి అభినవ్… శ్రీలంకకు బిజినెస్ ట్రిప్ కోసం వెళ్లాడు. కొలంబోలోని సినమన్ గ్రాండ్ హోటల్ లో వాళ్లు బస చేశారు. ఈస్టర్ రోజు చర్చికి వెళ్లి అక్కడి నుంచి వాళ్లు తిరిగి హోటల్ కు వచ్చే క్రమంలో బాంబు పేలుళ్ల ఘటన చోటు చేసుకున్నది. దీంతో వాళ్లు వెంటనే హోటల్ కు చేరుకున్నారు.

అయితే.. ముందుగా హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అనంతరం చర్చికి వెళ్దామని ఆ జంట అనుకున్నారు. తర్వాత ఎందుకో మనసు మార్చుకొని చర్చికి ముందు వెళ్లి రావడంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే.. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే… ఆయన దుబాయ్ నుంచి రెండు సార్లే బయటకి వచ్చాడట. ఆ రెండు సార్లు ఇలాగే బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయట. ఆ రెండు బాంబు పేలుళ్ల ఘటన నుంచి ఆయన తప్పించుకోవడం విశేషం. ఒకసారి ఇలాగే ముంబై బాంబు పేలుళ్ల ఘటన నుంచి కూడా తప్పించుకున్నాడట. ఇప్పుడు శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి.. చూస్తే మనోడికి నూరేళ్ల ఆయుష్షు ఉన్నట్టుంది.. అదృష్టవంతుడివి భయ్యా…

Read more RELATED
Recommended to you

Latest news