అరేయ్‌.. నా భార్యకు రెండో పెళ్లి చేస్తారా? పీటల మీదనే ఆగిపోయిన పెళ్లి

-

అర్రె… సినిమాల్లో కూడా ఇలాగే జరుగుతుందే.. కొంపదీసి.. అక్కడేమన్నా సినిమా షూటింగ్ జరుగుతుందా? అని అంటారా? అస్సలు కాదు. అక్కడ సినిమా షూటింగ్ ఏదీ జరగట్లేదు.

ఈరోజుల్లో పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ వివాహాలే ఎక్కువైపోతున్నాయి కదా. ఓ వ్యక్తి ఇదివరకే పెళ్లి చేసుకున్న అమ్మాయికి మళ్లీ పెళ్లి అయితే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు.. రచ్చ రచ్చ చేస్తాడు అంతే అంటారు కదా. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. మామూలు రచ్చ చేయలేదు. ఈ వార్త చదువుతుంటే అచ్చం సినిమా స్టోరీలాగానే ఉంటుంది. అందుకే.. సినిమాటిక్ గానే మనమూ చెప్పుకుందాం పదండి..

woman marriage stopped who tried to marry another in adilabad

పెళ్లి జరుగుతోంది. పెళ్లి మండలంలో అంతా సందడిగా ఉంది. పెళ్లికి వచ్చిన అతిథులంతా హడావుడి చేస్తున్నారు. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా ఇంకెప్పుడు తమకు పెళ్లి అవుతుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకో నిమిషంలో పెళ్లి అయిపోతుందనగా… ఆపండీ………………………….. అంటూ ఓ గొంతు వినిపించింది.

అర్రె… సినిమాల్లో కూడా ఇలాగే జరుగుతుందే.. కొంపదీసి.. అక్కడేమన్నా సినిమా షూటింగ్ జరుగుతుందా? అని అంటారా? అస్సలు కాదు. అక్కడ సినిమా షూటింగ్ ఏదీ జరగట్లేదు. ఇంతకీ ఆపండీ… అని అన్నది ఎవరు అంటారా? ఇంకో నిమిషంలో తాళి కట్టించుకోబోతున్న పెళ్లి కూతరు ఉంది కదా? ఆమె మొదటి భర్త. వార్నీ… ఇదివరకే పెళ్లి అయినా.. మళ్లీ ఇంకొకడితో ఎలా పెళ్లికి ఒప్పుకుంది.. ఇదేం విడ్డూరం అంటారా? అదే మరి అసలు ట్విస్ట్.

ఒక్కడే రాలేదు. సింహం సింగిల్ గానే వస్తుంది కానీ.. ఈ వ్యక్తి మాత్రం సెర్చ్ వారెంట్ తో పోలీసులను తీసుకొని వచ్చాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసలు మ్యాటర్ ఏంది.. అంటే ఆ యువకుడు… పెళ్లి పీటల మీద కూర్చున్న యువతిని ఇదివరకే ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడట. దానికి సంబంధించిన ఆధారాలన్నీ అక్కడున్న వారికి చూపించాడు.

తనతో ఆ యువతికి పెళ్లి అయినా.. మళ్లీ ఆ యువతికి వేరే వ్యక్తితో తన తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారని.. ఎలాగైనా తనను నాకు అప్పగించాలని అక్కడే పోలీసులను వేడుకున్నాడు ఆ యువకుడు. అసలే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఎవరికీ తెలియకుండా.. అంటే లేచిపోయి అన్నమాట. అటువంటప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారు. ససేమిరా అన్నారు. అంతేనా… అతడిని తమ బంధువులతో కొట్టించారు కూడా. నా భార్యను నాకు అప్పగించకుండా ఇలా దాడికి దిగడం ఏంది.. ఏదైతే అదైంది… కోర్టులోనే మీ సంగతేందో తేల్చుకుంటా… అని యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడట. మొత్తానికి పెళ్లి అయితే మాత్రం ఆగిపోయింది. మరి.. పెళ్లికి వచ్చిన అతిథులు భోజనాలు చేసి వెళ్లారో లేదో? ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదా.. సారీ.. మరిచిపోయా? తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news