కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో కూడిన లేఖను అమిత్ షా కు వ్రాశారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామా లో.. ధాన్యం రైతుల మరణాలకు బాధితులు ఎవరు అని నిలదీశారు రేవంత్ రెడ్డి.
పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన… మోడీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాత చెందిన భద్రాద్రి రాముడికి.. రామాయణం సర్క్యూట్ లో చోటు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అయోధ్య రాముడు… భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా ? అని నిప్పులు చెరిగారు.