పక్షవాతాన్ని పోగొట్టిన కోవిడ్‌ టీకా.. ఎక్కడంటే..?

-

కరోనా రక్కసి కారణంగా యావత్తు మానవాళి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. కొత్త కొత్త వేరియంట్లు రావడంతో మరింత భయపడుతున్నారు ప్రజలు. గత రెండేళ్ల నుండి కూడా కరోనా మహమ్మారి అందర్నీ పట్టిపీడిస్తోంది. కరోనా మహమ్మారి బారినపడకుండా సురక్షితంగా ఉండాలని వ్యాక్సిన్ ని కూడా తీసుకు వచ్చింది భారత ప్రభుత్వం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. మొదటి డోసు, రెండో డోసు మాత్రమే కాకుండా బూస్టర్ డోస్ కూడా ఇప్పుడు వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా చాలా రకాల ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జరిగిన సంఘటన ఏమిటి అంటే.. తాజాగా టీకా వేయించుకున్న ఒక వ్యక్తి లో అద్భుతమైన మార్పు చోటుచేసుకుంది. నిజానికి టీకా మ్యాజిక్ చేసింది అని చెప్పాలి. ఆ వ్యక్తికి పక్షవాతం. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి టీకాని వేయగా అతను కదలడం జరిగింది. ఇది అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ సంఘటన బొకారో జిల్లా లో చోటు చేసుకుంది. దులార్ చంద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐదేళ్ల పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుండి కూడా ఎలాంటి చలనం లేకుండా ఉంటున్నాడు. కరోనా టీకా వేయడంతో మ్యాజిక్ జరిగింది. చచ్చుబడిపోయి ఉన్న వ్యక్తి టీకా తీసుకున్న తర్వాత కదిలాడు. వ్యాక్సిన్ తీసుకున్నాక అద్భుతం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉదయం నుంచి కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. అలానే కదలికలు కూడా మొదలయ్యాయి. టీకా వేయడంతో ఇలా జరగడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news