గబ్బర్ సింగ్ కాంబినేషన్ మూవీ..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాటే. అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఏ.ఎం. రత్నం నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది కాని అది కాస్త అటకెక్కింది. ఇక లేటెస్ట్ గా డాలీ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని అన్నారు ఆ సినిమా గురించి కూడా ఎవరు చెప్పలేదు.

ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ హరీష్ శంకర్ డైరక్షన్ లో పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమా తీసి సంచలన విజయం అందుకున్నారు. బాలీవుడ్ దబాంగ్ సినిమా రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కు హిట్ ఇచ్చింది.

మరి మళ్లీ అదే కాంబినేషన్ లో మరో సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. డిజే తర్వాత దిల్ రాజుతో గొడవై బయటకు వచ్చిన హరీష్ శంకర్ పవన్ సినిమా చేసి సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందాలకు అవధులే ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news