ఈలాన్ మస్క్‌ పై లైంగిక ఆరోపణలు.. భారీ మొత్తంలో చెల్లింపులు!

-

సంచలనాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఈలాన్ మస్క్ సంబంధించిన ఓ వార్త సెన్సేషనల్ అయింది. ఈ వార్త విన్న ప్రతిఒక్కరూ ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటని అనుకుంటున్నారా..? 2016లో ఈలాన్ మస్క్ ఒక విమాన ప్రయాణ సమయంలో ఫ్లైట్‌లో హోస్ట్ ను లైంగికంగా వేధించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ సమయంలో బాధితురాలు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బులు అందజేసినట్లు సమాచారం.

ఈలాన్ మస్క్
ఈలాన్ మస్క్

ఈలాన్ మస్క్ లైంగికంగా వేధించిన విషయమే సెన్సెషనల్ అనుకుంటే.. బాధితురాలికి చెల్లించిన డబ్బులు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 2.50 లక్షల డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. 2018లో ఈ భారీ మొత్తాన్ని చెల్లించింది. అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్సెస్ఎక్స్ కు చెందిన కార్పొరేట్ జెట్‌లో సేవలు కూడా అందించారని సమాచారం.

అయితే ఆ బాధితురాలిని మసాజ్ సేవలు అందించేందుకు వీలుగా లైసెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు, ఒకానొక సందర్భంలో ప్రపోజ్ కూడా చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధితురాలు తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఈలాన్ మస్క్ పూర్తిగా ఖండించారు. తాను లైంగికంగా వేధించినట్లు అయితే ఇన్నేళ్లలో ఇలాంటి ఒక వార్త వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news