వివాహేత సంబంధంలా ఎప్పటికైనా ముప్పునే తీసుకువస్తాయి అనడానికి ఈ ఘటనే నిదర్శనం.. పచ్చని కాపురాలు కూల్చడమే కాదు.. భార్యనో.. భర్తనో నేరస్తులుగా మారుతున్న ఘటనలు కోకొల్లు. ఈ క్రమంలో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన ఓ 40 యేళ్ల మహిళ తన భర్త మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలిసింది. దీంతో అతను కోపంతో ఆమెను హెచ్చరించాడు.
అయినా ఆమె భర్త మాట వినలేదు. తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. తాను హెచ్చరించానా వినలేదని తీవ్ర ఆగ్రహం పెంచుకున్న భర్త తన మేనల్లుడిని ఆదివారం చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారమే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ సోమవారం మధ్యాహ్నం రైలు కిందపడి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పోలీసులు తరలించారు.