పది ఏళ్లు కల్వకుంట్ల కుటుంబం తరుపున కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారనే వచ్చే ఎన్నికల్లో అయిన దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా..? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేం కుటుంబ రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేఖం అని ఆయన అన్నారు. మీది ప్రజాస్వామ్య పార్టీనా..? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికి లైసెన్స్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. మేం సిద్దాంతపరంగా ఈ కుటుంబ రాజకీయాలను వ్యతిరేఖిస్తున్నాం అని అన్నారు. మోదీని విమర్శించే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదని ఆయన అన్నారు. దేశంలో కుటుంబ పార్టీల వల్ల అవినీతి పెరిగిందని అన్నారు. ముందుగా కేసీఆర్ లో గుణాత్మక మార్పు రావాలని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే… కేసీఆర్ నెలకు 18 గంటలు పనిచేస్తారని విమర్శించారు. తెలంగాణలో మార్పు తథ్యం అని అన్నారు. తెలంగాణకు ఏం ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని… కేంద్రం నుంచి నిధులు రాకుండానే తెలంగాణ డెవలప్ అవుతుందా..? అని ప్రశ్నించారు.
నరేంద్ర మోదీని విమర్శించే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు: కిషన్ రెడ్డి
-