చిరంజీవి – సుధాకర్ కి మధ్య ఉన్న బంధం ఏమిటో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈయన కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పవచ్చు. ఎవరి సపోర్టు లేకుండా కేవలం స్వయం కృషి నమ్ముకొని అగ్రహీరోగా అవతరించడం ఆయనకే సాధ్యమైంది. ఇక నటన మీద మక్కువతో నే తండ్రికి కూడా అబద్ధాలు చెప్పి మద్రాసు మకాం వేశాడు చిరంజీవి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఆ ఇంట్లో అప్పట్లో ఎస్వీఆర్, ఎన్టీఆర్ వంటి మహామహులు కూడా నివాసం ఉండేవారట. తను కూడా వారిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని చిరంజీవి ఎన్నో కలలు కనే వారు.Sudhakar Memories with chiranjeeviఇక ఇదే సమయంలో తన లాగే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సుధాకర్, హరిబాబు కూడా చిరంజీవికి పరిచయం అయ్యారు. ఇక దీంతో ముగ్గురు కలిసి ఇంట్లో అద్దెకు ఉండే వారు. ఉదయం అంతా సినిమా స్టూడియోల చుట్టూ తిరగడం.. సాయంత్రం రూమ్ కి చేరుకోవడం సమస్యలు చెప్పుకోవడం ఇలా రోజు వారి దినచర్యగా మారిపోయింది. ఇక ముగ్గురు కలిసి వంట చేసుకునే వారు అలా ఒక్కో పని పంచుకొని కలిసికట్టుగా సినిమా అవకాశాలు వెతుక్కునే వారు. ఇక ఈ క్రమంలోనే మొదటిసారి సుధాకర్ కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు. తమిళంలో హీరోగా వరుస విజయాలతో సంచలనం సృష్టించిన సుధాకర్ తన నటనతో పాపులారిటీ తో ఎంజీఆర్ , శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలకు పోటీగా నిలబడ్డారు. ఇక తెలుగులో హాస్య పాత్రలు చేస్తూ కమెడియన్ గా బిజీ అయిపోయారు.Chiranjeevi- Sudhakar: అలాంటి భార్య‌లు కావాల‌ని చిరంజీవి, నేను అనుకునే వాళ్లం.. సీనియర్ కమెడియన్ సుధాకర్ Senior comedian Sudakar remembers his relation with Megastar Chiranjeevi– News18 ...

అదేసమయంలో హరిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయితే చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా అవతారమెత్తారు. ఇక చిరంజీవి , సుధాకర్ మధ్య మంచి స్నేహ భావం ఉంది. వారిద్దరి మధ్య స్నేహం ఎంతలా వుందంటే.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గా జీవించారు. ఇప్పుడు చిరంజీవిని ఆయన సన్నిహితులు కలవడం లేదు అంటూ సుధాకర్ వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news