ఎన్టీఆర్ కు బాల‌య్య నివాళి

-

దిగంతాలను దాటిన ఖ్యాతి ఎన్టీఆర్ ది. ఆయ‌న్నుద్దేశించి కుమారుడు బాల‌య్య నివాళి ఇది. శ‌త జ‌యంతి వేళ ఆయ‌న్ను స్మ‌రిస్తూ.. నాన్న మార్గాన్ని తాను ఎన్న‌టికీ విడువ‌న‌ని అంటున్నారాయ‌న.

మీ సమక్షమే మా సమస్తము
మీ ప్రభావమే మా ప్రతి కణం
మీ ప్రస్తావనే మా ప్రతి క్షణం
మీ ప్రయాణమే మా ప్రమాణము
మీ ప్రభోథమే మా ప్రపంచము..

తెలుగు జాతిపై, తెలుగు సినీ పరిశ్రమపై, అయన విడిచిన ముద్ర ఎప్పటికి చెరిగిపోనిది,ఎవరు చెరపలేనిది.. పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో రాముడిగా, కృష్ణుడిగా, భీష్ముడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా, భీముడిగా, కర్ణుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు ఆయన. నటనకు డిక్షనరీ అంటు ఉంటే అది ఎన్టీఆర్ లాగానే ఉంటుంది, రాజకీయరంగ ప్రవేశం చేసి పార్టీ పెట్టిన 9 నెలలలోనే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలు అందించి పేదవాడి నోటుకాడ అన్నం ముద్దయ్యాడు, రంగం ఏదైనా ఎన్టీఆర్ కి తిరుగులేదు అని నిరూపించాడు, ఎప్పటికీ ఆయన నాకు హీరోనే. నాకు తండ్రి, గురువు, దైవం స్వర్గియ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా నివాళులు…జోహర్ ఎన్టీఆర్….

Read more RELATED
Recommended to you

Latest news