కేంద్రంపై ఢిల్లీ సీఎం ఫైర్.. మంత్రిపై ఫేక్ కేసు పెట్టారంటూ ఆరోపణ

-

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ పై స్పందించారు. మంత్రిపై మోపిన కేసులు పూర్తిగా నకిలీవన్నారు. కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిజాయతీకి కట్టుబడి ఉందని, అవినీతిని సహించమని పేర్కొన్నారు. జైన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే.. తానే స్వయంగా చర్యలు తీసుకునే వాడినని తెలిపారు. కానీ అతడిపై ఫేక్ కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు.

అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్

కాగా, మంగళవారం ఢిల్లీలో రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం.. విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా, సీఎం భగవంత్ మాన్‌ను తన మంత్రివర్గం నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. అయిదేళ్ల క్రితం ఢిల్లీలో మంత్రిని తొలగించి సీబీఐకు లేఖ కూడా రాసిన విషయాన్ని తెలిపారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ శిక్షించామన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అనేక కేసులు రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు. జైన్ కేసును తాను స్వయంగా అధ్యయనం చేశానని, అది పూర్తిగా ఫేక్ కేసని అర్థమైందన్నారు. జైన్ నిర్దోషిగా బయటకు వస్తారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news