మూడేళ్ళ ముచ్చట: ఫ్యాన్ వర్సెస్ సైకిల్..ప్లస్ ఎవరికి?

-

మొత్తానికి వైసీపీ అధికారంలోకి వచ్చి…టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళి మూడేళ్లు ముగిశాయి..కరెక్ట్ గా మే 30 2019 నాడు జగన్…సీఎంగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ జగన్ మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు. మరి ఈ మూడేళ్ళ జగన్ పాలన ఎలా ఉందంటే..అది జనాలకే తెలియాలి..అలాగే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు పరిస్తితి కూడా జనాలకే తెలియాలి.

అయితే ఎవరికి వారు తమకు ప్రజల మద్ధతు పెరిగిపోయిందని అనుకుంటున్నారు. ఎలాగో గత ఎన్నికల్లో జనమంతా జగన్ వైపు నిలబడ్డారు..ఇప్పటికీ కూడా జనం తమ వైపే ఉన్నారని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. జగన్ కు జనాలు ఇంకా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు కిందటి సారి 151 సీట్లు గెలిచామని..ఈ సారి కుప్పంతో కూడా కలిపి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు..ఇంకా టీడీపీ పని అయిపోయిందని,  మరో 30 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారని అంటున్నారు. అంటే ఇదంతా వైసీపీ వాళ్ళు చెబుతున్న మాటలు.

ఇక టీడీపీ నేతల విషయానికొస్తే…జగన్ పాలనతో జనం విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జగన్ ని చిత్తుగా ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని అంటున్నారు..రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని, అప్పుడు వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని అంటున్నారు. ఇక ఇది టీడీపీ వర్షన్.

అయితే జనం వర్షన్ ఏంటి అనేది క్లియర్ గా అర్ధం కావడం లేదు..వాస్తవానికి వైసీపీపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది..అలాగే టీడీపీకి కాస్త అనుకూలంగా ఉంది. కానీ వైసీపీ అధికారం కోల్పోయి, టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్తితి ఉందా? అంటే చెప్పలేమనే చెప్పాలి..ఎందుకంటే అంతవరకు జనం వెళ్ళినట్లు లేరు. మరి ఎన్నికల సమయంలోపు జనం ఎవరికి వైపు ఫిక్స్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news