Vivek Agnihotri: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరో హిందూ గొంతును అణచివేసింది.

-

‘ ది కాశ్బీర్ ఫైల్స్ ’ సినిమా ద్వారా 1990 కాశ్మీర్ హిందూ పండిట్లపై జరిగిన హత్యాకాండను ప్రజలకు చూపించారు డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. బాలీవుడ్ సినిమాల్లో తక్కువ బడ్జెట్ తో నిర్మితమై రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం వివేక్ అగ్ని హోత్రి యూరప్ లో హ్యుమానిటీ టూర్ లో ఉన్నాడు. అయితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అది రద్దు అయింది. 

పాకిస్తాన్, కాశ్మీరీ విద్యార్థుల నుంచి నిరసన ఎదురుకావడంతో ఈ కార్యక్రమాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు. ఈ ఉదంతపై ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘“హిందుఫోబిక్ ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో మరో హిందూ స్వరం అణిచివేయబడింది. వారు నన్ను రద్దు చేశారు. నిజానికి ఆక్స ఫర్డ్ యూనియన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులను రద్దు చేశారని.. ఇదంతా యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పాకిస్తానీ చేశాడని.. అత్యతం కష్టమైన పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి ’’ అని ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news