ఈ వీడియో రెండేళ్ల క్రితం తీసినదిగా అనుమానిస్తున్నారు. అయితే.. ఆ వీడియో నిజమైనదా? అబద్ధమా? అనే విషయాలు పక్కన బెడితే.. జాతీయ న్యూస్ చానెళ్లు కూడా ఆ వీడియోను ప్రసారం చేశాయి.
నాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వండి.. ప్రధాని మోదీని చంపేస్తా.. అని అంటున్నాడు ప్రధాని మోదీపై వారణాసిలో పోటీ చేసేందుకు ప్రయత్నించిన ఎస్పీ అభ్యర్థి తేజ్ బహదూర్ యాదవ్. ఆయన బీఎస్ఎఫ్ మాజీ జవాను. ఆయన ప్రధాని మోదీని చంపేస్తా.. అంటూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్పీ తరుపున వారణాసిలో తేజ్ బహదూర్ ఎంపీగా నామినేషన్ వేశాడు. అయితే.. సరైన పత్రాలు సమర్పించలేదని.. ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
ఈ వీడియో రెండేళ్ల క్రితం తీసినదిగా అనుమానిస్తున్నారు. అయితే.. ఆ వీడియో నిజమైనదా? అబద్ధమా? అనే విషయాలు పక్కన బెడితే.. జాతీయ న్యూస్ చానెళ్లు కూడా ఆ వీడియోను ప్రసారం చేశాయి.
ఓ స్నేహితుడితో తేజ్ మాట్లాడుతూ… 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తా.. అని అంటాడు. దానికి అతడి స్నేహితుడు స్పందిస్తూ.. నీకు డబ్బు కావాలంటే పాకిస్థాన్ ఇస్తుందని చెబుతాడు. తాను దేశభక్తుడినని… పాక్ సాయం తనకు అవసరం లేదంటాడు తేజ్. ఎవరైనా ఇండియన్స్ 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని చెప్పాడు తేజ్. అయితే.. ఈ వీడియోపై స్పందించిన తేజ్ బహదూర్.. అది ఫేక్ వీడియో అని.. ఎవరో కావాలని మార్ఫింగ్ చేశారని ఆరోపించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవతుండటంతో ఈ వీడియోపై బీజేపీ కూడా కాస్త గుర్రుగానే ఉంది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేసి… వీడియోలో మాట్లాడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మోదీని చంపేస్తానంటూ తేజ్ మాట్లాడిన వీడియో చూస్తారా?