హైదరాబాద్ లోని వనస్థలిపురంలో భారీ దోపిడి చోటు చేసుకున్నది. వనస్థలిపురంలో ఉన్న యాక్సిక్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెడుతున్న సెక్యూరిటీ సిబ్బంది కళ్లు కప్పి 70 లక్షలను దోచుకెళ్లారు దోపిడి దొంగలు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఏటీఎం డబ్బులు పెట్టే వ్యాను.. వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు చేరుకుంది. సిబ్బంది నగదును వ్యానులో నుంచి తీసి ఏటీఎంలో పెడుతున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న దుండగులు.. ప్లాన్ ప్రకారం.. నగదు పెట్టే సిబ్బంది దృష్టి మరల్చారు. వాళ్ల కళ్లు కప్పి.. 70 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.