10వ త‌ర‌గ‌తి త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌డం లేదా..? ఒక్క‌సారి ఇది చ‌దవండి..!

-

10వ త‌ర‌గ‌తి త‌రువాత విద్యార్థులు త‌మ కెరీర్‌ను ఎంచుకునే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఎంత చెప్పినా సరే.. విద్యార్థులు త‌మ‌కు ఇష్టం ఉన్న కోర్సునే చ‌ద‌వాలి.

ప్ర‌తి విద్యార్థి జీవితంలోనూ 10వ త‌ర‌గ‌తి అనేది చాలా కీల‌క స‌మయం. ఆ ద‌శ‌లో కెరీర్‌పై బాగా ఆలోచించాలి. ఆచి తూచి అడుగులు వేయాలి. తాము ఏం కోర్సు తీసుకుంటే మంచిదో, ఏ కోర్సుల‌కైతే భ‌విష్య‌త్తులో ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయో.. ఆ కోర్సుల‌ను ఒక‌టికి రెండు సార్లు వెరిఫై చేసుకుని మ‌రీ మంచి కాలేజీల్లో చేరాలి. అయితే 10వ త‌ర‌గ‌తి తరువాత చాలా మంది విద్యార్థుల‌కు నిజానికి ఈ ఏ కోర్సు తీసుకోవాలో అర్థం కాదు. అలాంటి వారి కోస‌మే కింద ప‌లు వివ‌రాల‌ను అంద‌జేస్తున్నాం. వీటితో 10వ త‌ర‌గ‌తి అయ్యాక ఏం చద‌వాల‌నే విషయంపై మీకో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. మ‌రి 10వ త‌ర‌గ‌తి త‌రువాత విద్యార్థులు ఏమేం కోర్సుల్లో చేరొచ్చో, వేటితో ఏం చేయొచ్చో, వేటిలో ఉద్యోగావ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. సైన్స్ అంటే బాగా ఇష్టం ఉన్న‌వారు టెన్త్ త‌రువాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్‌లో కోర్సులు చేయ‌వ‌చ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ త‌దిత‌ర కోర్సులు అందుబాటులో ఉంటాయి.

2. ఇంజినీరింగ్ చేయాల‌నుకునే వారు ఇంట‌ర్‌లో ఎంపీసీ తీసుకోవాలి. అదే మెడిసిన్ అయితే బైపీసీ తీసుకోవాలి. అవి కాక‌పోతే సైన్సు కోర్సుల‌తో ఎంసెట్‌, జేఈఈ, బిట్‌శాట్‌, నీట్ ప‌రీక్ష‌ల ద్వారా కూడా ఇంజినీరింగ్‌, మెడిసిన్ చేయ‌వ‌చ్చు.

3. బిజినెస్ చేయాల‌నుకునే వారు, ఆ రంగంలో ఉద్యోగం పొందాల‌ని అనుకునే వారు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంచుకోవాలి. ఇంట‌ర్‌లోనే ఈ కోర్సులు ఉంటాయి. సీఈసీ చ‌ద‌వ‌వ‌చ్చు. చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్‌, కంపెనీ సెక్ర‌ట‌రీస్‌, అకౌంటెంట్స్‌, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్ అడ్వ‌యిజర్స్ త‌దితర కెరీర్ల కోసం కామ‌ర్స్ కోర్సుల‌ను చ‌ద‌వాల్సి ఉంటుంది.

4. కామ‌ర్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్‌, అకౌంటెన్సీ, బిజినెస్ స్ట‌డీ, బిజినెస్ లా త‌దిత‌ర పాఠ్యాంశాలు ఉంటాయి. కామ‌ర్స్ ఇష్ట‌మైతే సీఈసీ లేదా హెచ్ఈసీ కోర్సుల‌ను ఎంచుకోవ‌చ్చు.

5. ఆర్ట్స్ చ‌ద‌వాల‌నుకుంటే సైకాల‌జీ, పొలిటిక‌ల్ సైన్స్‌, ఫిలాస‌ఫీ, హిస్ట‌రీ, లిట‌రేచ‌ర్‌, సోషియాల‌జీ పాఠ్యాంశాలు ఎంచుకోవాలి. వీటితో జర్న‌లిజం, లిట‌రేచ‌ర్‌, సోష‌ల్ వ‌ర్క్‌, టీచింగ్ రంగాల్లో కెరీర్ ఉంటుంది. అలాగే ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్‌, అర‌బిక్ వంటి లాంగ్వేజెస్ కోర్సుల‌ను కూడా చేయ‌వ‌చ్చు.

6. ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దివాక డిప్లొమా, వొకేష‌నల్‌, స‌ర్టిఫికెట్ కోర్సుల‌ను కూడా చేయ‌వ‌చ్చు. ఐటీఐలో ఎల‌క్ట్రిషియ‌న్‌, కార్పెంట‌ర్‌, ప్లంబ‌ర్‌, మెకానిక్‌, ఫిట్ట‌ర్‌, టెక్నిషియ‌న్ కోర్సులు చేయ‌వ‌చ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నిక‌ల్ కోర్సుల‌ను చేస్తే పుష్క‌లంగా అవ‌కాశాలు ఉంటాయి.

7. టెక్నిక‌ల్ రంగం అయితే సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్‌, గార్మెంట్ టెక్నాల‌జీ, హోం సైన్స్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్‌, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల‌ను చ‌ద‌వ‌వ‌చ్చు.

10వ త‌ర‌గ‌తి త‌రువాత విద్యార్థులు త‌మ కెరీర్‌ను ఎంచుకునే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఎంత చెప్పినా సరే.. విద్యార్థులు త‌మ‌కు ఇష్టం ఉన్న కోర్సునే చ‌ద‌వాలి. దాంతో ఆ కోర్సులో రాణించి మంచి కెరీర్‌ను, మంచి భ‌విష్య‌త్తును పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news