ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి : ఎమ్మెల్యే సీతక్క

-

ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. సోమవారం ఆమె మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం ఇందనపల్లి పంచాయతీ పరిధి నాయకపు గూడెంకు చెందిన గిరిజన మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అడవిలోకి చేపల వేటకు వెళ్లిన ఆదివాసి మహిళలను, వారికి మద్దతు పలికిన జర్నలిస్టులను కేసులు, నోటీసుల పేరుతో అటవీ అధికారులు వేధించడం మానుకోవాలని ఎమ్మెల్యే సీతక్క హితవు పలికారు.

Warangal: Congress likely to field Seethakka

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆటవిక పాలన కొనసాగుతుందని ఆమె మండిపడ్డారు. అటవీశాఖ మంత్రి ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్‌ చేశారు. అడవిలో చేపలు పట్టిన ఆదివాసీ మహిళలపై కేసులు, జరిమానాల పేరుతో వేధించడాన్ని మానుకోవాలని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. అటవీ శాఖ మంత్రి ఇలాఖాలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్న సీతక్క.. వారి తీరు మారకపోతే తగిన విధంగా బుద్ది చెపుతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news